భారతదేశం, నవంబర్ 10 -- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్దిదిద్దాలనేది తన కల అని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మెట్రో మార్గంతో అనుసంధానం చేయనున్నట్టుగా వెల్లడించారు.

'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నాం. సౌత్ ఇండియాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అమృత్ భారత్ పథకం కింద రూ.714 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నాం. ఇప్పటివరకు 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.' అని కిషన్ రెడ్డి తెలిపారు.

ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రోజువారీగా 1,97,000 మంది ప్రయాణ...