భారతదేశం, నవంబర్ 8 -- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్ల నిర్మాణంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా అన్ని జిల్లాలను అనుసంధానించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇక విజయవాడ - హైదరాబాద్ విస్తరణ పనులపై కూడా మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రూ.10,400 కోట్లతో హైదరాబాద్‌-విజయవాడ హైవేను 4 లైన్ల నుంచి 8 లైన్లుగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.

గ్రామీ...