భారతదేశం, మే 4 -- మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 1990లో విడుదలైన ఈ ఫ్యాంటసీ సినిమా బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు ప్రేక్షకులకు అప్పట్లో కొత్త అనుభూతిని కలిగించింది. క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. అందాల దేవత శ్రీదేవీ ఈ మూవీలో హీరోయిన్‍గా చేశారు. ఈ మరపురాని క్లాసిక్ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి కొన్ని విశేషాలు ఇవి..

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరో ఐదు రోజుల్లో మే 9వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. సరిగ్గా 35 ఏళ్లకు మళ్లీ వెండితెరపై ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చేస్తోంది. అప్పట్లో 1990 మే 9న ఈ మూవీ విడుదలైంది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3డీ వెర్షన్‍లోనూ రిలీజ్ చేస్త...