Hyderabad, జూలై 21 -- ఈ ఏడాది ఇండియాలో రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. జనవరి నుంచి జూన్ నెల ముగిసే సమయానికి మొత్తంగా దేశంలో అన్ని సినిమాలు కలిపి వసూలు చేసిన మొత్తం రూ.5723 కోట్లు అని ఆర్మాక్స్ రిపోర్టు వెల్లడించింది. వీటిలో ఇండియాలో అత్యధిక గ్రాస్ వసూళ్ల సినిమాల్లో తొలి స్థానంలో హిందీ మూవీ ఛావా ఉండగా.. రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ అయింది. తొలి ఆరు నెలల్లో రిలీజైన అన్ని భాషల సినిమాలు కలిపి ఏకంగా రూ.5723 కోట్లు రాబట్టాయి. గతేడాది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువని ఆర్మాక్స్ రిపోర్టు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.5032 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక గత ఐదేళ్లలో 2022లో అత్యధిక వసూళ్లు రాగా.. దానికి కేవలం రూ.15 కోట్ల దూరంలో నిలిచిపోయింది.

ఈ ఏడాది రూ.693 క...