Hyderabad, అక్టోబర్ 10 -- 'కాంతార ఛాప్టర్ 1' విజయంతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఉప్పొంగిపోతున్నాడు. 2022లో విడుదలైన కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో అతడు నటించడమే కాకుండా దీనికి కథ అందించి, దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొడుతున్న నేపథ్యంలో.. శుక్రవారం (అక్టోబర్ 10) ఉదయం రిషబ్ ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించి, ఆశీస్సులు తీసుకున్నాడు.

శుక్రవారం ఉదయం రిషబ్ శెట్టి ఆలయ ప్రాంగణం నుండి బయటకు వస్తున్నప్పుడు.. అతని చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా కనిపించాడు. తెల్లటి షర్టు, తెల్లటి పంచె ధరించిన రిషబ్.. అభిమానులు అభివాదం చేస్తుంటే నవ్వుతూ కనిపించాడు. అతడు కొన్ని సెకన్ల పాటు ఫోటోలకు పోజు ఇచ్చి తర్వాత కారులోకి ఎక్కాడు.

అటు 'కాంతార ఛాప్టర్ 1' మేకర్...