భారతదేశం, నవంబర్ 2 -- అదృష్టం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. మనం అనుకోం.. కానీ మనకు రావాలి అని రాసిపెట్టి ఉంటే.. లక్షలు విలువ చేసేదైనా కాళ్ల దగ్గరకు వస్తుంది. అలాంటి వాటికి తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ. ఇటీవల చౌటుప్పల్‌కు చెందిన వ్యక్తి తన ఇంటిని విక్రయించేందుకు లక్కీ డ్రా పద్ధతి ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ లక్కీ డ్రాలో 10 నెలల పాప రూ.500కే రూ.16 లక్షల విలువైన ఇంటిని సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కంచర్ల రామబ్రహ్మం అనే వ్యక్తికి రేకుల గదితో 66 గజాల ఇంటి స్థలం ఉంది. అయితే దీనిని అమ్మడానికి ఆయన వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. లక్కీ డ్రా పద్ధతిలో ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.500 విలువైన కూపన్‌ను కొనుగోలు చేసి.. లక్కీ డ్రాలో పాల్గొనాలని ఫ్లెక...