భారతదేశం, ఏప్రిల్ 23 -- హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. గ్రానైట్‌ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. తొందర్లోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో నాలుగు రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుండగా, ఇంతలో ఆ పార్టీ ఎమ్మెల్యేపై డబ్బులు డిమాండ్ చేసినందుకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న కట్టా మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామ శివారులో గ్రానైట్ క్వారీ నడుపుతున్నాడు.

హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి. క్వ...