భారతదేశం, జూలై 10 -- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొన్ని దేశాలకు జీవితకాల గోల్డెన్ వీసాలను రూ.23.30 లక్షలకే మంజూరు చేస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈ పుకారును యూఏఈకి చెందిన ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) తోసిపుచ్చింది.

గోల్డెన్ వీసా షరతులను సరళీకరించినట్టుగా కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు వచ్చాయని యూఏఈ పేర్కొంది. ఒక విదేశీ వాణిజ్య కన్సల్టెన్సీ ఈ పని చేసినట్టుగా గుర్తించింది. ఆ కథనాల్లో వాస్తవలం లేదని క్లారిటీ ఇచ్చింది. గోల్డెన్ వీసా పరిశీలన బాధ్యతను యూఏఈ ప్రభుత్వం నామినేష్ పద్ధతిలో కొన్ని సంస్థలకు అప్పగించినదాంట్లో వాస్తవం లేదని తెలిపింది. గోల్డెన్ వీసా గురించి ఏదైనా సమాచారం కావాలంటే ఐసీపీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపింది.

గోల్డెన్ వీసా వర్గాలు, షరతులు, నిబంధనలు.. అధి...