భారతదేశం, జూలై 27 -- రూ.2000 పైబడిన యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించబోతోందా? ఈ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో సమాధానం ఇచ్చారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రూ.2000 యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు.

రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లేదా యూపీఐ లావాదేవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోందా? అని ఇటీవల ఎగువసభలో మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సూచన రాలేదు. జీఎస్టీ రేట్లు, మినహాయింపులు పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ సూచనలపై ఆధారపడి ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపా...