భారతదేశం, మే 29 -- ేంద్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదు. అతి తక్కువ ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బీమా కవరేజీని అందించే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం గురించి చూద్దాం..

ఈ పథకం పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై). ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియంతో నిరుపేదలను కవర్ చేయడమే ఈ పథకం లక్ష్యం. సొంత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఏడాది కాలపరిమితితో ఈ స్కీమ్ ఉంటుంది. ఈ కాలం జూన్ 1 నుంచి మే 31 వరకు. మే 31లోగా ఈ ప్లాన్‌ను రెన్యువల్ చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కవరేజీ గురించి మాట్లాడితే.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ .2 లక్షల కవరేజీ ఉంది. ఇది కాకుండా రెండు కళ్ళు పూర్తిగ...