భారతదేశం, నవంబర్ 6 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం (నవంబర్ 6) రెండు వేర్వేరు వార్తలతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ మరో షెడ్యూల్ కు రెడీ అవుతూ కనిపించడం. ఇక మరొకటి అతడు ఏకంగా రూ.2.2 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్ పెట్టుకోవడం.

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు కనులవిందు చేశాడు. గురువారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న కమల్ వాచ్ కంపెనీ షోరూమ్ కు అతడు వెళ్లాడు. అక్కడ ప్రముఖ బ్రాండ్ రోలెక్స్ కలెక్షన్ ను చూశాడు. అంతేకాదు ఏకంగా రూ.2.2 కోట్ల విలువైన ఓ వాచ్ అతడు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కమల్ వాచ్ కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

తారక్ స్టైలిష్ లుక్ లో కారు దిగి షోరూమ్ లోకి అడుగుపెట్టడం, అక్కడ సిబ్బంది ఇచ్చిన ఆ ఖరీదైన వాచ్ పెట్టుకోవడం ఆ ...