భారతదేశం, ఆగస్టు 1 -- ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీ రూ.17,000 కోట్ల రుణా మోసం కేసుల్లో విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. గత వారం రిలయన్స్ గ్రూప్‌నకు సంబంధించిన అనేక ప్రదేశాలపై ఈడీ దాడులు నిర్వహించింది. ముంబైలోని 35 ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి. మనీలాండరింగ్ చట్టం (PMLA) కింద 50 కంపెనీలు, 25 మందికి చెందిన 35 కంపెనీలపై దాడులు చేశారు.పై

దీనికి సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా.. ఈడీతోపాటుగా మరో రెండు సంస్థలకు నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నివేదిక రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా తీసుకున్న రూ.10,000 కోట్ల రుణాలు కూడా మళ్లింపు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్‌కార్పొరేట్ డిపాజిట్ (ఐసీడీ) రూపంలో రిలయన్స్ గ్రూప్ కం...