భారతదేశం, జనవరి 19 -- కరోనా మహమ్మారి తర్వాత ఇండియన్ సినిమా 2025లో చెలరేగిపోయింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఆర్మాక్స్ మీడియా' (Ormax Media) రిపోర్టు ప్రకారం.. 2025లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. 13,397 కోట్లకు చేరాయి. 2024తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. 2023లో నమోదైన రూ. 12,198 కోట్ల రికార్డును కూడా ఈ ఏడాది బ్రేక్ చేసింది.

చాలా రోజులుగా సౌత్ సినిమాల హవాలో కొట్టుకుపోతున్న హిందీ సినిమా గతేడాది మళ్లీ గాడిలో పడింది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' (Dhurandhar) మూవీ ఇండియాలో ఏకంగా రూ. 950.1 కోట్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఈ సినిమా విజయంతో హిందీ పరిశ్రమ మొత్తం వసూళ్లు రూ. 5,504 కోట్లకు చేరాయి. ఇది గతేడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువ కావడం విశేషం. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల...