భారతదేశం, ఫిబ్రవరి 2 -- పశ్చిమబెంగాల్‌లో ఓ మహిళ తన భర్తను కిడ్నీ అమ్మాలని పట్టుబట్టింది. రూ.10 లక్షలకు బేరం కుదిరేలా చేసింది. ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన భర్త చివరకు ఆమె మాటలతో తన కిడ్నీని అమ్మేందుకు అంగీకరించాడు. అయితే కిడ్నీ అమ్మి వచ్చిన డబ్బుతో భార్య ప్రియుడితో కలిసి పారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ బెంగాల్లో అరుదైన కేసు వెలుగుచూసింది. హౌరా జిల్లా సంక్రైల్‌కు చెందిన ఓ మహిళ తన భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది. అయితే భర్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనితో పక్కా ప్రణాళిక వేసింది. కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించాలని భర్తపై ఒత్తిడి తెచ్చింది.

కుమార్తె చదువు, వివాహం కోసం డబ్బును ఇప్పటి నుంచే కూడబెట్టాలని చెప్పింది. దీంతో భర్త నిజమే కదా అని నమ్మేలా చేసింది. ఈ మేరకు భర్తకు...