భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఇప్పుడు చాలా మంది మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేస్తున్నారు. అయితే, సిప్​ (సిస్టెమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​) ద్వారా ఇన్వెస్ట్​ చేయాలా? లేక లంప్​సమ్​ ద్వారా ఇన్వెస్ట్​ చేయాలా? అని ఆలోచిస్తుంటారు. రెండూ సంపదను సృష్టిస్తాయి కానీ రిస్క్​ వేరువేరుగా ఉంటాయి. దీనిని ఒక ఉదాహరణతో తెలుసుకుందాము. నెలకు రూ. 10వేల సిప్​, రూ.10లక్షల సింగిల్​ ఇన్వెస్ట్​మెంట్​.. ఈ రెండింటిలో ఏది ముందు మీకు రూ. 1కోటి తెచ్చిపెడుతుందో చూద్దాము..

సాధారణంగా స్టాక్​ మార్కెట్​లో రిటర్నులను లెక్కించేడప్పుడు.. ఇండెక్స్​ ఫండ్​ని ప్రామాణికంగా తీసుకుంటారు. స్టాక్​ మార్కెట్​ హిస్టరీ ప్రకారం.. ఇండెక్స్​ ఫండ్​ దీర్ఘకాలంలో సగటున 12శాతం రిటర్నులను ఇచ్చింది. ఈ లెక్కను.. మీరు నెలకు రూ. 10వేల సిప్​ చేస్తే, 12శాతం చొప్పున మీరు రూ. 1కోటి సంపాదించేందుకు 21ఏళ...