భారతదేశం, ఏప్రిల్ 14 -- ప్రస్తుతం మార్కెట్లో అన్ని రేంజ్‌ల ఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. మీరు సరసమైన ధరలో ఉత్తమ ఫీచర్లతో కూడిన ఎల్ఈడీ టీవీ కోసం చూస్తున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ మీకోసం ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో రూ.10,000లోపు ధరతో టీవీలు దొరుకుతున్నాయి. వాటి గురించి చూద్దాం..

60 సెం.మీ (24 అంగుళాలు) ప్రీమియం సిరీస్ హెచ్‌డి రెడీ ఎల్‌ఈడీ టీవీ విడబ్ల్యు 24 ఎ (బ్లాక్). ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ .4999కు లభిస్తుంది. ఈ టీవీలో కంపెనీ 1366x768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ లెవల్ 300 నిట్స్. ఇన్‌బిల్ట్ బాక్స్ స్పీకర్, 20వాట్ సౌండ్ అవుట్ పుట్‌తో ఈ టీవీ వస్తుంది. టీవీ ఫ్రేమ్‌లెస్ డిజైన్ దాని రూపాన్ని చాలా ప్రీమియంగా చేస్తుంది.

రియ...