భారతదేశం, అక్టోబర్ 8 -- సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపీబీ(State Investment Promotion Board) సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఎస్ఐపీబీ సమావేశం జరగ్గా.. పలు అంశాలపై లోతుగా చర్చించారు.

ఈ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు. ఈ 30 పెట్టుబడులు ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 67,000 ఉద్యోగాలను వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

'11వ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు(SIPB) సమావేశం ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలలో రూ.1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించింది.' అని ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.

ర...