భారతదేశం, జనవరి 2 -- సోషల్ మీడియాలో ఏదైనా వార్త కనిపిస్తే చాలు, అది నిజమో కాదో తెలుసుకోకుండానే వైరల్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. తాజాగా రూ. 500 నోట్ల చలామణిపై కూడా ఇటువంటి ఒక తప్పుడు వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 2026 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 500 నోట్లను ఉపసంహరించుకోబోతోందన్నది ఆ వార్త సారాంశం.

ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం 'పిఐబి ఫ్యాక్ట్ చెక్' (PIB Fact Check) స్పందించింది. "రూ. 500 నోట్లను నిలిపివేస్తున్నట్లు ఆర్‌బీఐ ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, అది పూర్తిగా అవాస్తవం" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తేల్చి చెప్పింది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్లు చట్టబద్ధమైనవని, వాటిని యధావిధిగా లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ధ...