భారతదేశం, జూన్ 14 -- పంప్ తయారీదారు, డిస్ట్రిబ్యూటర్ ఓస్వాల్ పంప్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజే ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ లభించింది. ఓస్వాల్ పంప్స్ ఐపీఓ అనేది మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఓస్వాల్ పంప్స్ ఐపీఓ మూడు రోజుల సబ్ స్క్రిప్షన్ పీరియడ్ జూన్ 13న ప్రారంభమై జూన్ 17న ముగియనుంది. ఓస్వాల్ పంప్స్ ఐపీఓ కేటాయింపు తేదీ జూన్ 18, ఐపీఓ లిస్టింగ్ తేదీ జూన్ 20గా భావిస్తున్నారు. ఈ కంపెనీ ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయనున్నారు.

రూ.890 కోట్ల విలువైన 1.45 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, రూ.497.34 కోట్ల విలువైన 81 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కాంపొనెంట్ కలిపి పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,387.34 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఓస్వాల్ పంప్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక...