భారతదేశం, జనవరి 24 -- బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్ద చర్చ జరుగుతూనే ఉంటుంది. కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీలు ఇటువంటి హానికరమైన అలవాట్లను ప్రోత్సహించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తుంటారు.

బాలీవుడ్ అగ్ర హీరోలు అయిన అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి తారలు ఇప్పటికే ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, తాజాగా హిందీ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది.

ఇటీవల 'పీపింగ్ మూన్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సునీల్ శెట్టి తాను పొగాకు (టొబాకో) ప్రకటనలకు ఎందుకు దూరంగా ఉంటారో వివరించారు. "నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఆరోగ్యం. నా శరీరం సహకరించడం వల్లే చిత్ర పరిశ్రమలో సున...