భారతదేశం, నవంబర్ 25 -- మోటోరోలా సంస్థ నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ తాజాగా ఇండియాలో అడుగుపెట్టింది. దాని పేరు మోటో జీ57 పవర్​. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. భారీ 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన ఈ ఫోన్, ధరతో పాటు స్పెసిఫికేషన్ల పరంగా మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ కొత్త మోటోరోలా హ్యాండ్‌సెట్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్​ని అమర్చారు. ఇది 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ మోటో జీ57 పవర్​ స్మార్ట్​ఫోన్​లో 6.72 ఇంచ్​ ఎల్​సీడీ ప్యానెల్ ఉంది. ఇది 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120హెచ్​జెడ్​ టచ్ శాంప్లింగ్ రేట్స గరిష్టంగా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కేవలం ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ...