Telangana,hyderabad, సెప్టెంబర్ 10 -- గత కొంతకాలంగా తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. అవినీతి అధికారులను పక్కాగా పట్టేసుకుంటున్నారు. సమాచారం అందితే చాలు. తమదైన శైలిలో ఆపరేషన్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా ఓ టౌన్ ప్లానింగ్ అధికారిణి కూడా ఏసీబీ వలకు చిక్కిపోయారు. రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

తెలంగాణ ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో మణిహారిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మంచిరేవులలోని ఓ ఓపెన్‌ ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ ఇచ్చేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది. అయితే ఫైనల్ గా రూ. 4 లక్షలకు బేరం కుదుర్చుకుంది.

ఇక డబ్బులు ఇచ్చుకోలేని ఫిర్యాదుదారుడు. నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక మంగళవారం రోజు నార్సింగి మున్సిపాలిటీ కార్యా...