భారతదేశం, జూన్ 13 -- భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో అతి తక్కువ కాలంలోనే ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కు విపరీతమైన డిమాండ్​ పెరిగింది. రోడ్ల మీద ఒకప్పుడు ఒకటి, రెండుగా కనిపించే ఈవీల సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్​ని ఆటోమొబైల్​ సంస్థలు లాంచ్​ చేస్తున్నాయి. పైగా, ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు ఎప్పటికప్పుడు దిగొస్తున్నాయి కూడా! రూ. 10లక్షల బడ్జెట్​లో ఇప్పుడు దేశంలో మంచి ఎలక్ట్రిక్​ కార్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ ఈవీని తీసుకోవాలని ప్లాన్​ చేస్తుంటే.. ఈ డేట్​ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి..

టాటా పంచ్​- టాటా పంచ్ ఈవీ​లో రెండు ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఒకటి 25 కేడబ్ల్యూహెచ్​, ఇంకొకటి 35 కేడబ్ల్యూహెచ్​. 25 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 315 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. 35 కే...