భారతదేశం, నవంబర్ 2 -- అమెరికాలో జరిగే ఒక ప్రముఖ టెక్నాలజీ సదస్సులో పాల్గొనాలన్న ఓ భారతీయ సాంకేతిక నిపుణుడి కల నిమిషంలోనే చెదిరిపోయింది! దిల్లీలోని యూఎస్ ఎంబసీలో ఇతని బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూ కేవలం మూడు ప్రశ్నలకే ముగిసిపోయింది. ఆ మూడు ప్రశ్నలు అడిగి అతడి వీసాను వెంటనే తిరస్కరించారు అధికారి.

క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫారమ్‌లపై పనిచేసే ఆ సీనియర్ టెక్నికల్ లీడ్.. తన అనుభవాన్ని పంచుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి సలహాల కోసం సామాజిక మాధ్యమం రెడిట్​ను ఆశ్రయించారు. ఈ పోస్ట్ వెంటనే ఇతర ఐటీ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. ఇంత త్వరగా వీసా ఎందుకు తిరస్కరణకు గురైంది? అర్థం చేసుకోవడానికి వారందా పోస్ట్​ని చూస్తున్నారు.

తన రెడిట్ పోస్ట్‌లో, ఆ టెక్ నిపుణుడు ఇలా రాశారు: "ఈ రోజు దిల్లీలోని యూఎస్ ఎంబసీలో నా బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూ జరిగింది...