భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోపేదల అభ్యున్నతి కోసం 56 ఏళ్లుగా కృషి చేస్తోన్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడంపై అఖిలపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. ఐదున్నర దశాబ్దాలుగా మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.

విన్సెంట్‌ ఫెర్రర్‌ 1969లో అనంతపురంలో ప్రారంభించిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ఏపీ, తెలంగాణల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఏటా వందల కోట్ల రుపాయల విదేశీ నిధులతో స్వచ్ఛంధ సేవా కార్యక్రమాలను ఆర్డీటీ నిర్వహిస్తోంది. ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేయడంపై ఇటీవల అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి జోక్యాన్ని సైతం కోరారు. రా...