భారతదేశం, డిసెంబర్ 7 -- ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకంతో పాటు మరికొన్నింటిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ... ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 7.48 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు వచ్చే ఏడాది మార్చిలోగా ఫీజిబిలిటీ ఉన్న గృహాలపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యంతో రూప్ టాప్ సోలార్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. సోలార్ ప్యానల్స్ ను అమర్చిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నెట్ మీటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎం...