Hyderabad, ఏప్రిల్ 19 -- ఇంట్లో దొరికే పసుపుతోనే ముఖ కాంతిని పెంచుకునేందుకు రకరకాల ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కాదు. గాలి కాలుష్యం వల్ల ఎంతోమంది ముఖ కాంతిని కోల్పోతూ ఉంటారు. మార్కెట్ లో దొరికే కాస్మోటిక్స్ వైపు మొగ్గు చూపుతారు.

ప్రతిరోజూ బ్యూటీ క్రీమ్, సీరమ్, ఫేస్ వాష్ వంటి అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి డబ్బు ఖర్చు చేసే బదులు వంటగదిలో దొరికే పదార్థాలను ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కరి వంటగదిలో దొరికే పసుపు ఒక స్వచ్ఛమైన నేచురల్ రెమెడీ. ఎలాంటి కెమికల్స్ దానిలో ఉండవు.

పసుపును వంటల్లో ప్రతిరోజూ వినియోగిస్తారు. పాలలో కూడా పసుపు మిక్స్ చేసి తాగుతారు. దీని వల్ల శరీర ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ బ్యాక్ట...