భారతదేశం, డిసెంబర్ 3 -- బుధవారం భారత రూపాయి (Indian Rupee) చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా 90 రూపాయల కీలక మైలురాయిని దాటింది. బుధవారం నాడు రూపాయి ఏకంగా Rs.90.13 కనిష్ట స్థాయిని నమోదు చేసింది.

పాత రికార్డు బ్రేక్: అంతకుముందు మంగళవారం రోజున రూపాయి అత్యంత కనిష్టంగా Rs.89.9475 వద్ద ముగిసింది. అయితే, బుధవారం ఈ పాత ఆల్‌టైమ్ లో రికార్డును చెరిపేస్తూ కొత్త కనిష్టాన్ని తాకింది.

రూపాయి మారకం విలువ ఈ స్థాయిలో పడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పోర్ట్‌ఫోలియో ప్రవాహాల బలహీనత: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు (FPI) తరలిపోతుండడం, కొత్త పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.

వాణిజ్య లోటు ఆందోళనలు: దేశీయ వా...