భారతదేశం, డిసెంబర్ 21 -- వరుస ఫ్లాప్ లకు చెక్ పెట్టేందుకు, మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు రవితేజ రూట్ మార్చాడు. తనకు మాస్ ఇమేజీని తెచ్చిన మాస్ మహారాజ్ ట్యాగ్ ను కూడా పక్కనపెట్టేశాడు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

సాధారణంగా రవితేజను మాస్ మహారాజ్ అని పిలుస్తారు. సినిమా టైటిల్స్ లోనూ ఈ ట్యాగ్ వేస్తారు. తన యాక్టింగ్ తో, మాస్ సినిమాలతో అతను ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కోసం మాస్ మహారాజ్ ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పాడంటా. ఈ విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ కిశోర్ తిరుమల వెల్లడించాడు.

మాస్ మహారాజ్ ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వరుసగా మాస్ సినిమాలతో ఫ్లాప్ లు మూట...