భారతదేశం, డిసెంబర్ 25 -- విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై కూటమి ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రానికి స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తూనే, ప్రజా ప్రయోజనాన్ని నిర్ధారించడంపై దృష్టి పెడుతుందని అని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ వినియోగానికి ఆచరణీయమైన ఎంపికలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మూడోసారి సమావేశం అయింది.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(పర్యాటక) అజయ్ జైన్, ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి సహా సీనియర్ అధికారులు రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ప్రతిపాదనల స్థితిని కమిటీకి వివరించారు. తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా వంటి ప్రముఖ ఆతిథ్య బ్రాండ్ల నుండి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రులు కేశవ్, దుర్గేష్ వెల్లడించారు. అయితే ప్రస్తుత నిర్మాణా...