Andhrapradesh, మే 30 -- ఏపీలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూజు రోజులపాటు కూడా వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఇవాళ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్త...