Hyderabad, మే 25 -- గోరుచిక్కుడు ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. మరి దానికి కొబ్బరి రుచి తోడైతే? ఇంకేముంది. వావ్ అనాల్సిందే కదా! అటువంటి రుచికరమైన రెసిపీనే మీ ముందుకుతెచ్చాం. ఈ కొబ్బరి గోరుచిక్కుడు కూర అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి దేనితో పాటు తీసుకున్నా కూడా అదిరిపోతుంది. కేవలం అరగంటలో రెడీ అయిపోయే ఈ రుచికరమైన కూరను ఎలా చేయాలో చూసేయండి.

వంట చేస్తున్న నమూనా చిత్రం

ఈ కొబ్బరి గోరుచిక్కుడు కూర కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గోరుచిక్కుడులో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే విటమిన్లు A, C, K వంటి ముఖ్యమైన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, మెదడు పనితీరుకు తోడ్పడతాయి.

Published...