భారతదేశం, ఏప్రిల్ 25 -- ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌చిన్ మూవీ రీ రిలీజ్‌లో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌తో కుమ్మేస్తోంది. త‌మిళ‌నాడు బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా ఎనిమిది కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రీ రిలీజ్ మూవీస్‌లో గిల్లి త‌ర్వాత అత‌డిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సౌత్ ఇండియ‌న్ మూవీగా స‌చిన్ నిలిచింది.

ఏప్రిల్ 18న థియేట‌ర్ల‌లో రీ రిలీజైన స‌చిన్ మూవీ తొలిరోజు ఏకంగా 2.2 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. రెండో రోజు ఈ మూవీకి కోటి తొంభై ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే ఆరు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మొత్తంగా గురువారం నాటికి ఈ మూవీకి 8.20 కోట్ల క‌లెక్ష‌న్స్‌ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఈ వీకెండ్ లోగా ప‌ది కోట్ల మార్క్‌ను ఈ మూవీ ట‌చ్ చేస్తుంద‌ని అంటున్నారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ గిల్లి మూవీ రీ రిలీజ్‌లో ఏకంగా...