భారతదేశం, ఫిబ్రవరి 7 -- సోషల్ మీడియా వ్యసనం, మరీ ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​ రీల్స్ మోజు అనేది ఎంత ప్రాణాంతకంగా మారిందో గుర్తుచేసే ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ బండా జిల్లాకు చెందిన ఒక మహిళ ఉరి వేసుకుంటున్నట్టు వీడియో చిత్రీకరించే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.

27 ఏళ్ల మోహిని అనే మహిళ తన ఇంట్లో రీల్ షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మోహిని ఉరి వేసుకుంటున్నట్లుగా ఉండే ఒక దృశ్యాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించింది. ఆమె తన మెడకు ఉచ్చు వేసుకుని, ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించడానికి ఒక స్టూల్‌పై నిలబడింది.

కానీ క్షణాల వ్యవధిలోనే పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కాలు జారిపోయిందా లేదా బ్యాలెన్స్​ కోల్పోయిందా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ ఉరి మాత్రం ఆమె పాలిట శాప...