భారతదేశం, డిసెంబర్ 25 -- ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసిన తర్వాత చాలా మంది తమ పని అయిపోయిందని భావిస్తారు. కానీ, ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి వస్తున్న మెయిల్స్, ఎస్ఎంఎస్‌లు పన్ను చెల్లింపుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐటీఆర్ దాఖలులో పొరపాట్లు ఉన్నాయని, అందుకే మీ రిఫండ్ నిలిపివేస్తున్నామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31, 2025 వరకు గడువు ఇచ్చారు.

అయితే, చాలా మందికి వచ్చే అసలు సందేహం ఏంటంటే.. తాము 'రివైజ్డ్ ఐటీఆర్' (Revised ITR) వేయాలా? లేక 'బిలేటెడ్ ఐటీఆర్' (Belated ITR) వేయాలా? అని. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు, గడువు ముగిస్తే జరిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఇప్పటికే నిర్ణీత గడువులోగా (సాధారణంగా జూలై 31) ఐటీఆర్ ఫైల్ చేసి ఉండి.. అందులో ఏదైనా సమాచారం తప్పుగా ఇచ్చినా లేదా ఏదైనా ఆద...