Hyderabad, ఏప్రిల్ 13 -- సొగసైన సిల్కీ జుట్టు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీని కోసం మన బడ్జెట్ కు అందుబాటులో ఉన్న ప్రతి టెక్నిక్ వాడేస్తాం. ఎవరికైనా మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలిస్తే చాలా మనం కూడా అదే ప్రోసెస్ ఫాలో అయిపోతాం. వివిధ రకాల హెయిర్ మాస్క్‌లు, నూనెలు, కండిషనర్లను ఉపయోగిస్తుంటాం. ఇదే కోవలో జుట్టు అందాన్ని పెంచడానికి ఇటీవల కాలంలో ఒక కొత్త టెక్నిక్ ట్రెండింగ్ గా మారింది. అదేంటంటే, రివర్స్ హెయిర్ వాషింగ్.

మీ జుట్టు ఎక్కువగా ఎండిపోయి, గుచ్చుకుంటూ లేదా త్వరగా జిడ్డుకు మారిపోతుంటే రివర్స్ హెయిర్ వాషింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియను ప్రీ-కండిషనింగ్ అని కూడా అంటారు.

రెగ్యూలర్ గా జుట్టును ఎలా కడుగుతున్నామో, రివర్స్ హెయిర్ వాషింగ్ దానికి పూర్తిగా వ్యతిరేకం. సాధారణంగా తల వెంట్రుకలు వాష్ చేసుకునేందుకు ముందుగా షాంపూ వాడుతాము...