Hyderabad, జూలై 27 -- ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో నాన్-థియేట్రికల్ బిజినెస్ ఒక సినిమాకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కరోనా తరువాత నాన్-థియేట్రికల్ మీదనే భారీ బడ్జెట్‌తో పాటు మామూలు సినిమా మేకర్స్ ఆధారపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ ఒక జాక్ పాట్ కొట్టింది.

సుందరకాండ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌ను భారీ ధరకు రికార్డ్ స్థాయిలో చేసింది. ఏకంగా రూ. 12 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించి సంచలనం సృష్టించింది సుందరకాండ సినిమా.

సుందరకాండ మూవీ డిజిటల్ (ఓటీటీ) అండ్ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ రూ. 12 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ రూ. 9 కోట్లు, హిందీ డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్‌ను రూ. 3 కోట్లకు అమ్మేసి మొత్తం నాన్-థియేట...