భారతదేశం, జూలై 21 -- ఆయిల్ నుంచి టెలికాం రంగాల వరకు విస్తరించి ఉన్న దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్​తో ముగిసిన త్రైమాసికంలో తన నికర లాభంలో 76 శాతం పెరుగుదలను ప్రకటించినప్పటికీ, సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో షేరు ధర 2 శాతం కంటే ఎక్కువ పడింది.

ఉదయం 9:40 గంటలకు, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్​ షేరు ధర 2.57శాతం నష్టంతో రూ. 1,438.50 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ముగింపు ధర (రూ. 1,476)తో పోలిస్తే, సోమవారం ఉదయం రూ. 1,465 వద్ద ప్రారంభమైంది.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ తన టెలికాం, రిటైల్, ఆయిల్-టు-కెమికల్ వ్యాపారాల్లో బలమైన పనితీరుతో అత్యధిక కన్సాలిడేటెడ్ త్రైమాసిక ఈబిటా, నికర లాభాన్ని నివేదించింది.

జూన్ త్రైమాసికంలో (Q1FY26), కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ పాట్​లో ఏడాదికి ఏడాది 76 శాతం వృద్ధిని సాధించింది. ఇది మార్కె...