భారతదేశం, సెప్టెంబర్ 10 -- సుమధుర గ్రూపు కొత్త ప్రాజెక్టుల కోసం బెంగళూరులో ఏకంగా రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా నివాస గృహాలు, అలాగే డెవలప్‌ చేసిన ప్లాట్ల ప్రాజెక్టులు కూడా ఉన్నాయని సుమధుర గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ గుండ వెల్లడించారు.

వీటిలో దేవానహళ్లిలో రూ.75 లక్షల నుంచి రూ.2 కోట్ల ధరల శ్రేణిలో ప్లాట్ల ప్రాజెక్టులతో పాటు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ (ORR), మాన్యతా టెక్ పార్క్ సమీపంలో మధ్యస్థాయి ప్రాజెక్టులను నిర్మిస్తామని ఆయన తెలిపారు.

నిర్మాణ రంగానికి అవసరమయ్యే సిమెంట్, గ్రానైట్, మార్బుల్ వంటి కీలక వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మధుసూదన్ గుండ హర్షం వ్యక్తం చేశారు. ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ఖర్చును తగ్గిస్తుందని చెప్పారు.

"దీనివల్...