భారతదేశం, ఆగస్టు 25 -- భారత మార్కెట్‌లో రియల్‌మీ పీ4 5జీ మొదటి సేల్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. కంపెనీ గత వారం రియల్‌మీ పీ4 ప్రోతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. సిరీస్ ప్రో మోడల్ అమ్మకాలు ఆగస్టు 27న ప్రారంభమవుతాయి. బలమైన బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, స్ట్రాంగ్ ప్రాసెసర్‌తో ఈ రియల్‌మీ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లోని కస్టమర్లకు మంచి ఆప్షన్‌గా మారుతుంది.

రియల్‌మీ పీ4 5జీలో మూడు స్టోరేజ్ వేరియంట్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. దీని 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,499గా నిర్ణయించారు. వీటిలో మరో వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,499గానూ, టాప్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,499గానూ ఉంది.

మ...