భారతదేశం, జనవరి 30 -- భారతదేశ రిటైల్ రంగంలో భాగ్యనగరం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2025 ఏడాదికి సంబంధించి దేశవ్యాప్తంగా రిటైల్ లీజింగ్ (Retail Leasing) 8.9 మిలియన్ చదరపు అడుగుల మార్కును తాకగా, ఇందులో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన వాణిజ్య స్థలాల్లో (New Supply) హైదరాబాద్ ఏకంగా 52 శాతం వాటాను కైవసం చేసుకుని దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

సీబీఆర్ఈ (CBRE) తాజాగా విడుదల చేసిన 'ఇండియా రిటైల్ ఫిగర్స్ H2 2025' నివేదిక ప్రకారం.. 2024తో పోలిస్తే 2025లో కొత్త రిటైల్ సరఫరా 268 శాతం వృద్ధి చెంది 4.3 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఈ కొత్త సరఫరాలో హైదరాబాద్ వాటా 52 శాతం కాగా, ముంబై 30 శాతం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ 18 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2025 ద్వితీయార్థంలో (జూలై-...