భారతదేశం, డిసెంబర్ 10 -- రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైమ్‌లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.

పట్టాదారు పాస్ పుస్తకం కోసం భూ యజమానులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని.. రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలని స్పష్టం చేశారు. దీనిపై ప్రతీనెలా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.

సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ...