భారతదేశం, ఏప్రిల్ 22 -- ఎవరి జీవితం వాళ్లదే. ఒకరిని చూసి పోల్చుకోవడం.. ఎవరో ఏదో అనుకుంటున్నారని కుమిలిపోవడం అనవసరం. ఎవరికో సమాధానం చెప్పాల్సి వస్తుందని జీవితాన్ని చేజేతులా ముగించుకోవడం తెలివి తక్కువ పని. పరీక్షల ఫలితాలతో, ఫెయిల్ అయ్యామనే అవమానంతో తనువు చాలించడం సరికాదు. ఆత్మహత్య వద్దూ అంటూ స్ఫూర్తి నింపే ఈ సాంగ్ ను ఒక్కసారి వినండి. లిరిక్స్ ఒక్కసారి పాడండి. ఆలోచనలు పక్కనపెట్టండి.

కొన్ని పాటలు ఆనందాన్నిస్తాయి. కొన్ని పాటలు ఆలోచింపజేస్తాయి. కొన్ని పాటలు మాత్రం జీవితాలనే మారుస్తాయి. 2014లో వచ్చిన 'మిస్టర్ నూకయ్య' మూవీలోని 'ఒకే ఒక జీవితం' సాంగ్ కూడా జీవితాన్ని మార్చే పాటనే. ఈ సాంగ్ లిరిక్స్ లో ఎంతో అర్థం ఉంది.

ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. హరిచరణ్ అంతే గొప్పగా పాడారు...