భారతదేశం, మే 29 -- మీరు ఒక డాక్టర్ అయితే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలని కలలు కంటుంటే మీ కోసం గుడ్‌న్యూస్. ఆర్‌బీఐ మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు rbi.org.inని సందర్శించి ఆఫ్‌లైన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 13 పోస్టులకు నియామకాల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎంబీబీఎస్ లేదా ఎండీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు మాత్రమే నియామకాలకు అర్హులు. అలాగే మీరు జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకానికి ఆర్బీఐ ఇంకా ఎటువంటి వయోపరిమితిని నిర్ణయించలేదు.

ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ...