భారతదేశం, నవంబర్ 27 -- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవ...