Hyderabad, ఏప్రిల్ 20 -- ఫ్యాషన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఖర్చు. వేలకు వేలు డబ్బులు పోస్తే గానీ ఫ్యాషన్, ట్రెండ్ ని ఫాలో అవలేమనే భయం. ఏంటి.. ఫ్యాషన్ అంటే ఖర్చేనా, రిచ్‌గా కనిపించాలంటే బ్రాండెడ్ షర్ట్ లేదంటే పాపులర్ డిజైనర్ డ్రెస్సే వేసుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఆలోచించే వారైతే ఇది మీ కోసమే.

నిజానికి రిచ్ లుక్ అనేది వేసుకునే దుస్తులు, వాడే వస్తువుల ధర మీద ఆధారపడదు. వాటిని ఉపయోగించే వ్యక్తిలో ఉండే ఆత్మవిశ్వాసం, సెలెక్షన్, నీట్ ప్రజెంటేషన్ ఉంటే చాలంటున్నారు నిపుణులు. వీటన్నిటితో పాటు తక్కువ ఖర్చుతో రిచ్‌గా, ఫ్యాషనబుల్‌గా ఎలా కనిపించాలో ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

ఒక బ్రాండెడ్ లోగో కలిగిన ఖరీదైన డ్రెస్ వేసుకున్న వారికన్నా, చక్కగా ఐరన్ చేసి వేసుకున్న ప్లెయిన్, లైట్ కలర్ డ్రెస్ వేసుకున్...