భారతదేశం, డిసెంబర్ 25 -- భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికిన టాటా నెక్సాన్ ఈవీ మరో అరుదైన ఘనతను సాధించింది. దేశీయ రోడ్లపై ఈ కారు 1లక్ష విక్రయాల మార్కును దాటింది. ఇండియాలో ఒక ఎలక్ట్రిక్​ కారు 1లక్ష సేల్స్​ మైలురాయిని దాటడం ఇదే తొలిసారి.

కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అనుకున్న ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు సైతం చేరువ చేయడంలో నెక్సాన్ ఈవీ కీలక పాత్ర పోషించింది.

2020లో నెక్సాన్ ఈవీ తొలిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. ఎలక్ట్రిక్ కార్లంటే మైలేజీ (రేంజ్) తక్కువని, ధరలు ఎక్కువని, ఛార్జింగ్ సదుపాయాలు ఉండవని వినియోగదారులు సందేహించేవారు. ఈ అడ్డంకులన్నింటినీ టాటా మోటార్స్ ధైర్యంగా ఎదుర్కొంది. సరైన రేంజ్, అందుబాటులో ఉండే ధర, నమ్మకమైన వారంటీతో ప్రజల్లో ఉన్న భయాలను తొలగించి, ఎలక్ట్రిక్ వాహనాలపై భ...