భారతదేశం, జనవరి 11 -- విరాట్ కోహ్లి మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ తనలో పరుగుల వేగం తగ్గలేదు. ఆటపై కసి తీరలేదేని మరోసారి స్పష్టం చేశాడు. ఈ రికార్డుల వివరాలపై ఓ లుక్కేయండి.

పరుగుల రారాజు, రన్ మెషిన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28 వేల పరుగులు కంప్లీట్ చేసిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు కింగ్ కోహ్లి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్. ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లి ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఛేజింగ్ లో 13వ ఓవర్లో విరాట్ ఈ ఘనత సాధించాడు.

విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 28000 పరుగుల మైల్ ...