భారతదేశం, జనవరి 28 -- సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ మన శంకర వరప్రసాద్ గారు దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. 15 రోజులైనా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ కొనసాగిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను అన్నయ్య చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు దాటేసింది.

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించింది.

చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఈ చిత్రం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.358 కో...