భారతదేశం, ఏప్రిల్ 30 -- ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ మధ్య జరిగిన షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం (ఏప్రిల్ 29) అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో హోం గ్రౌండ్ లో ఢిల్లీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిశాక జరిగిన ఘటనలో రింకు సింగ్ చెంపను కుల్దీప్ రెండు సార్లు చెళ్లుమనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న క్లిప్‌లో.. కుల్దీప్, రింకు తో పాటు ఇతర ఆటగాళ్లు మ్యాచ్ ముగిశాక నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు. కానీ ఒక్కసారిగా రింకు చెంపపై కుల్దీప్ యాదవ్ బలంగా కొట్టాడు. కుల్దీప్ సరదాగానే కొట్టినా అది రింకు సింగ్ కు నచ్చలేదు. అతను షాక్ కు గురయ్యాడు. వెంటనే కోపం తో చూశాడు. మళ్లీ రింకు చెంపపై కుల్దీప్ కొట్టాడు.

ఈ వీడియో క్లిప్ లో ...